ఇల్లు అనుమతి మంజూరులో నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రాజంపేట టౌన్ ప్లానింగ్ అధికారిణి భారతి కేసులో ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి టి.భాస్కర్ రావు తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితురాలికి మూడేళ్ల జైలు శిక్ష, 5 వేల రూపాయలు జరిమానా విధించినట్లు తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ సిరాజుద్దీన్ అనే వ్యక్తి 2014 లో తన ఇంటి నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, అప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారిణిగా పనిచేస్తున్న భారతి నాలుగు వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు కడపజిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించగా,టౌన్ ప్లానింగ్ అధికారిణి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా నేరం రుజువు కావటంతో కర్నూలు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి శిక్ష ఖరారు చేసినట్లు కడప డీఎస్పీ ఎం.నాగభూషణం తెలిపారు.
ఇదీ చూడండి: