కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన బాలుడుని గుర్తించిన పోలీసులు.. గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించారు. రాజంపేటకు చెందిన షేక్ ఖాదర్‌బాషా, షేక్ సాదియ దంపతులు తమ రెండేళ్ల కుమారుడితో కలిసి పని నిమిత్తం కడప రవీంద్ర నగర్‌కు వచ్చారు. కాగా...బాలుడు ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు.
ఓ మసీదు వద్ద ఏడుస్తూ కనిపించిన బాలుడిని గుర్తించిన బ్లూ కోర్ట్స్ పోలీసులు..చుట్టుపక్కల వారిని విచారించారు. అనంతరం తాలూకా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కొద్దిసేపటికి తల్లిదండ్రులు బాలుడి కోసం వెతకటం ప్రారంభించి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడ బాలుడు కనిపించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు విచారించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇదీ చదవండి:
ఎస్పీ పేరుపై నకిలీ ఫేస్బుక్ ఖాతా.. డబ్బులు కావాలంటూ చాటింగ్...