కడప జిల్లా పోలీసులు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశానుసారం ఖాకీ దుస్తులను పక్కన పెట్టి సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. తెల్లని చొక్కా, పంచ, కండువా ధరించి... ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పండగ కళ ఉట్టిపడేలా.. స్టేషన్ ఆవరణలో ముగ్గులు వేయించారు.
ఎస్పీ అన్బురాజన్‌ను మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి... సరదాగా గడిపారు. పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా కాలానికి తాము కూడా ప్రజలతో పాటు సంక్రాంతి పండగ చేసుకున్నామని పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించడం సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: