సోమశిల వెనక జలాలతో ముంపునకు గురైన వారికి ఎలాంటి కష్టాలు లేకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. ముంపు ప్రాంతాలైన గోపవరం, అట్లూరు, ఒంటిమిట్ట మండలాల్లోని 15 గ్రామాలను ఆయన పరిశీలించారు. అనంతరం కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ను కలిసి ముంపు వాసుల కష్టాలు తీర్చే విధంగా ప్రభుత్వానికి విన్నవించాలని మెమోరాండం అందజేశారు. చరిత్రలోనే తొలిసారిగా సోమశిల జలాశయంలో 78 టీఎంసీల నీటిని నిల్వచేశారని.... దాని ఫలితంగా కడప జిల్లాలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. సోమశిల జలాశయంలో కనీసం రెండు టీఎంసీలు తగ్గిస్తే ముంపు గ్రామాలకు కష్టాలు తీరుతాయనే విషయాన్ని జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు అవినాశ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: సోమశిల ముంపుప్రాంతాల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటన