ETV Bharat / state

సాధారణ మహిళా... సౌదీ కోర్టులో గెలిచింది

ఊరు కాని ఊరు... దేశం గాని దేశం... చదువు రాదు... భాష తెలియదు... కానీ పట్టుదల ఉంది. ఆ పట్టుదలతోనే పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వెళ్లింది. తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కష్టపడుతోంది. ఆ పట్టుదల నచ్చలేదేమో... కన్నీళ్లు ఆ తల్లిని వెంటాడాయి. రెండేళ్లు పని చేయించుకొని... యజమాని జీతం ఇవ్వకపోగా... ముప్పుతిప్పలు పెట్టాడు. బాధలన్నీ మౌనంగానే భరించిన కడప జిల్లాకు చెందిన ఓ మహిళ... సౌదీ పోలీసులు, భారత ఎంబసీ అధికారుల సాయంతో సౌదీ న్యాయస్థానంలో కేసు గెలిచి కడప చేరుకుంది.

సాధారణ మహిళా... సౌదీ కోర్టులో గెలిచింది
author img

By

Published : May 4, 2019, 11:31 AM IST

కడప జిల్లా రామాపురం మండలానికి చెందిన లక్ష్మీదేవి బతుకుదెరువు కోసం 30 ఏళ్ల కిందట కడప పట్టణంలో స్థిరపడింది. ఆమె భర్త సుబ్బారాయుడు పండ్ల వ్యాపారం చేస్తూ... కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుర్ల వివాహం చేశారు. కొడుకును ఉన్నత చదువులు చదివించాలని... సొంత ఇల్లు నిర్మించుకోవాలనేది లక్ష్మీదేవి కోరిక. ఈ ఉద్దేశంతోనే రెండేళ్ల కిందట సౌదీకి పయనమైంది. అక్కడ ఓ ఇంట్లో పనిమనిషిగా చేరింది.

కానీ ఆ యజమాని కఠిన హృదయం కలవాడని చేరాక తెలిసింది. వెళ్లినప్పటి నుంచి లక్ష్మీదేవికి తిప్పలు తప్పలేదు. చిత్రహింసలు పెట్టేవారు. ఏడాదిపాటు బాత్​రూంలోనే పడుకుంది. జీతం ఇవ్వమని అడిగితే... రేపు.. మాపు అంటూ రెండేళ్లు బుకాయించాడు. ఆఖరికి భర్త చనిపోయాడని చెప్పినా ఇండియాకు పంపలేదు. యజమాని భార్య లక్ష్మీదేవి కంట్లో పొడిచింది. అన్నీ భరించిన ఆ సహనశీలి... న్యాయం కోసం భారత ఎంబసీకి వచ్చింది. తను ఎదుర్కొన్న అవమానాల గురించి అక్కడి పోలీసులకు, భారత్ ఎంబసీ అధికారులకు తెలిపింది. అక్కడి కోర్టులో ఫిర్యాదు చేసింది.

లక్ష్మీదేవి దీనగాథ విన్న కోర్టు... ఆమె వాదన సరైందని తీర్పు చెప్పింది. లక్ష్మీదేవికి రావాల్సిన 3లక్షల 15వేల జీతంలో 2లక్షల 15వేలు ఇప్పించారు. దేశం కాని దేశంలో... పోరాటం చేసి తనకు రావాల్సిన జీతం నగదు 80శాతం రాబట్టుకొని స్వదేశానికి పయనమైంది. ప్రాణంతో వస్తానని అనుకోలేదని... దేవుని దయతో తిరిగి తన పిల్లల వద్దకు వచ్చానని లక్ష్మీదేవి కన్నీటి పర్యంతమైంది. లక్ష్మీదేవి ధైర్యాన్ని మహిళలందరు ఆదర్శంగా తీసుకోవాలని స్థానికులు కొనియాడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.