ETV Bharat / state

కడప పేలుడు ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ అన్బురాజన్‌ - kadapa district latest news

కడప జిల్లాలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ పరిశీలించారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందారన్న ఎస్పీ... ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు గుర్తించామన్నారు.

kadapa district sp inspected quarry blast place
కడప పేలుడు ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ అన్బురాజన్‌
author img

By

Published : May 8, 2021, 4:41 PM IST

Updated : May 8, 2021, 6:12 PM IST

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె ముగ్గురాయి గని వద్ద పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందారన్న ఎస్పీ... ఇప్పటివరకు ఆరుగిరి మృతదేహాలను గుర్తించామని తెలిపారు. మరో నాలుగు మృతదేహాల వివరాలను ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

కడప పేలుడు ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ అన్బురాజన్‌

మృతులు కలసపాడు, వేముల మండలానికి చెందినవారిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బద్వేలు ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశామన్న ఎస్పీ అన్బురాజన్... జిలెటిన్‌ స్టిక్స్ వినియోగానికి అనుమతి ఉందా, లేదా అనేది పరిశీలిస్తామన్నారు.

ఇదీ చదవండి:

మద్యం అమ్మకాలకు క్యూ.. వ్యాక్సిన్ల కేంద్రాల వద్ద తోపులటా?: లోకేశ్

Last Updated : May 8, 2021, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.