ETV Bharat / state

వాళ్లు కూతకెళితే.. పతకాలే.. కానీ! - రైల్వే కోడూర్ కబడ్డీ విజేతలు న్యూస్

కబడ్డీ.. కబడ్డీ అంటూ కూతకెళితే ఆ కిక్కే వేరు. మన రాష్ట్రంలో ఈ ఆటకు క్రేజ్ ఇంకా ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వమూ.. కబడ్డీని అధికారిక క్రీడగా గుర్తించింది. కడప జిల్లా రైల్వే కోడురుకు చెందిన వారు.. ఈ క్రీడలో జాతీయ స్థాయిలోనూ.. పతకాలు సాధిస్తున్నారు. వారంతా పేద విద్యార్థులే. కోచ్ అండతో వాళ్లు ముందుకుసాగుతున్నారు.

kadapa district railway kodur kabaddi team need finacial help
author img

By

Published : Nov 9, 2019, 7:03 AM IST

వాళ్లు కూతకెళితే.. పతకాలే.. కానీ!

కడప జిల్లా రైల్వేకోడూరులో కొన్నేళ్లుగా కోచ్ పుల్లయ్య ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తున్నారు కొంతమంది విద్యార్థులు. ఇందులో ఎక్కువమంది పేదవారే. అరకొర వసతులతోనే పుల్లయ్య ఈ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన చాలామంది పతకాలతోపాటు ఉద్యోగాలు సాధించారు.

కోచ్ పుల్లయ్య సహకారంతోనే తాము విజయాలు సాధిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేకున్నా.. దాతల సాయంతో వసతులు కల్పించి.. తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు. ప్రో కబడ్డీ ఆడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.

'నేను ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో పీఈటీగా పని చేస్తున్నా. రైల్వేకోడూరులోని అనేక పాఠశాలలో కబడ్డీపై మక్కువ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటున్నా. వారికి అరకొర వసతులతో శిక్షణ ఇస్తున్నా. స్థానిక ఎస్వీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఆర్థికంగా సాయం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. రైల్వేకోడూరులో ప్రతిభ కలిగిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. నా వద్ద శిక్షణ తీసుకున్న 17 మంది విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు స్పందించి కబడ్డీ క్లబ్ ఏర్పాటు చేసి ఆర్థికంగా సాయపడితే రాష్ట్రానికే మంచి పేరు తీసుకువస్తాను'

-పుల్లయ్య, కోచ్​

జాతీయ జట్టుకు ఎంపికైన వారు, ఉద్యోగాలు సాధించిన వారు

  1. 2012 - 13 లో ఎస్.అరుణ జాతీయ జట్టుకు ఎంపికైంది.
  2. 2013-2014 లో ఎఎస్. షబ్బీర్, కే . ప్రశాంత్ పైకా కబడ్డీ, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కు సెలక్ట్ అయ్యారు.
  3. 2017-2018లో కార్తీక్ అనే విద్యార్థి జూనియర్ నేషనల్ మరియు సౌత్ జోన్ కబడ్డీ పోటీల్లో పాల్గొని స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. గణేష్ అనే విద్యార్థి సైతం సౌత్ జోన్ పోటీల్లో పాల్గొన్నాడు.
  4. 2019-20లో రంగస్వామి అనే విద్యార్థి ఇండో కబడ్డీ కర్ణాటక జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. డిసెంబర్లో దిల్లీలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్నాడు.

ఇదీ చదవండి:డేవిడ్​ మలన్ వేగవంతమైన సెంచరీ​.. ఇంగ్లాండ్ విజయం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.