కడప జిల్లా మైలవరం జలాశయానికి జలకళ సంతరించుకుంది. సుమారు పదిహేను ఏళ్లుగా ఇంత మోతాదులో నీటి నిలువ పెట్టలేదు. వరుస కరవులతో ఎప్పుడు డెడ్ స్టోరేజీకి పరిమితమయ్యే జలాశయం ఈ ఏడాది కురిసిన వర్షాలకు పూర్తిస్థాయిలో నిండింది. గత నెల 4వ తేదీన మైలవరం జలాశయం నుంచి పెన్నాకు నీటిని విడుదల చేశారు. ఇప్పటికీ నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. సుమారు 35 రోజులుగా 11 టీఎంసీల వరకు నీటిని దిగువకు వదిలారు. గండికోట జలాశయం నుంచి మైలవరం నీటి విడుదల కొనసాగుతోంది. మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 6.20 టీఎంసీల నీటి నిల్వ మైలవరం డ్యామ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి