కడప జిల్లాలో కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తున్నందున శుభకార్యాలకు 50 మందిని మాత్రమే అనుమతిస్తామని కలెక్టర్ హరికిరణ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అన్ని పురపాలక సంఘాల కమిషనర్లు, ఎంపీడీవోలు పక్కాగా నిబంధనలు అమలు చేయాలని సూచించారు. అంత్యక్రియలకు సంబంధించి 20 మందికి మించకూడదని స్పష్టం చేశారు. వ్యాయామశాలలు, స్పా సెంటర్లు, క్రీడా సముదాయాలు తదితర వాటిల్లోనూ నిబంధనలు అమలయ్యేలా యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ప్రజారవాణా వాహనాలకు సంబంధించి 50 శాతం సామర్థ్యం మించకుండా ఆర్టీవోలు, ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. క్రమం తప్పకుండా రవాణా వాహనాలను శానిటైజ్ చేయాలని ఆదేశించారు. సినిమా థియేటర్లలో సీటు సీటుకు మధ్య ఖాళీ ఉండే విధంగా చూడాలని.. వీటిపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కూడా సిబ్బంది మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండేలా చూడాలని కలెక్టర్ హరికిరణ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుములను ఉపేక్షించొద్దు: హైకోర్టు