ETV Bharat / state

రిమ్స్​లో కరోనా టెస్టింగ్​ ల్యాబ్​ను పరిశీలించిన కలెక్టర్​ - corona testing lab in kadapa

కడప జిల్లాలో రిమ్స్​లో ఏర్పాటు చేసిన ఐసీఎంఆర్​ ధ్రువీకృత కరోనా టెస్టింగ్​ ల్యాబ్​ను కలెక్టర్​ హరికిరణ్​ తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సౌకర్యాలు, సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అత్యవసరమని సిఫారసు చేసిన వారి టెస్టింగ్​ ఫలితాలు 24 గంటలలోపు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కరోనా పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.

రిమ్స్​లో కరోనా టెస్టింగ్​ ల్యాబ్​ను పరిశీలించిన కలెక్టర్​

author img

By

Published : Apr 12, 2020, 5:10 PM IST

కడప జిల్లాలోని రిమ్స్​లో కరోనా టెస్టింగ్ ల్యాబ్​ను జిల్లా కలెక్టర్​ హరికిరణ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కరోనా పరీక్షలు చేసే విధానాన్ని పరిశీలించారు. ఐసీఎంఆర్​ వెబ్​సైట్​, రాష్ట్ర ప్రభుత్వ వెబ్​సైట్​లో డేటాను సిబ్బంది నమోదు చేస్తున్న తీరుపై ఆరా తీశారు. అత్యవసరమని వైద్యులు సిఫారసు చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి.. వారి టెస్టింగ్​ ఫలితాలను 24 గంటలలోపు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. 1,230 నమూనాలు పరీక్షలకు పంపించగా.. అందులో 829 ఫలితాలు వచ్చాయని, ఇంకా 401 ఫలితాలు రావాల్సి ఉందని అన్నారు. కరోనా పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

'ప్రాణాలు పణంగా పెడుతున్నాం... భద్రత కల్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.