కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో యువజన సంఘం నాయకులు ప్ల కార్డులతో నిరసన తెలియజేశారు. జిల్లాలోని విలేకరులను కరోనా వారియర్స్ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. విధుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డీవైఎఫ్ఐ, ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఈనెల 17వ తేదీన కడప జిల్లాలో మృతిచెందిన జర్నలిస్టులు మధుసూదన్ రెడ్డి, వెంకటసుబ్బయ్య కుటుంబాలకు పరిహారం తక్షణమే చెల్లించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ పేరుతో వైద్య సిబ్బందికి, పోలీసులకు అమలు చేస్తున్న విధంగా జర్నలిస్టులకు కూడా 50 లక్షల బీమా వర్తింప చేయాలన్నారు. తెలంగాణలో అమలు చేసిన విధంగా మన రాష్ట్రంలోనూ ప్రతి విలేకరికి రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని 6 నెలల పాటు చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండి: