ETV Bharat / state

సినిమా థియేటర్ల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ - జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గౌతమి

సినిమా థియేటర్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన నేపథ్యంలో టాకీస్​ యాజమాన్యాలు కొవిడ్-19 నిబంధనలు పాటించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. కొవిడ్-19 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.

jc gouthami review on guidelines for the management of movie theaters in Kadapa
సినిమా థియేటర్ల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ
author img

By

Published : Oct 10, 2020, 6:49 AM IST

కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే.. ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లాలో సినిమా థియేటర్ల నిర్వహణకు అనుమతి ఇవ్వడం జరిగిందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎం.గౌతమి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని సినిమా థియేటర్ల యజమానులు ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్-19 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.

  • థియేటర్లలో సీటింగ్ పరిమితిని 50% మాత్రమే ఉండేలా, 200 మందికి మించకుండా చూసుకోవాలి.
  • థియేటర్లలోకి ప్రవేశ సయమంలో ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
  • హ్యాండ్ వాష్, శానిటైజర్లను థియేటర్ల ప్రవేశ ద్వారం, టాయిలెట్ల వద్ద అందుబాటులో ఉంచాలి. థియేటర్ పరిసరాలను తరచుగా శానిటైజ్​ చేయించాలి.
  • సినిమా హాళ్ల ఆవరణ ప్రాంతం విశాలంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ కొవిడ్​ నిబంధనలను పాటించేలా ప్రత్యేక పర్యవేక్షక సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి.
  • పరిసరాల్లో ప్రజారోగ్య భద్రతపై ప్రభుత్వ మార్గదర్శకాలను తెలియజేస్తూ.. స్లయిడ్ షోలు, పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటు చేయాలి.

ఈ నెల 15 నుంచి పైన పేర్కొన్న మార్గదర్శకాలను థియేటర్ల యాజమాన్యం పాటించేలా.. ఆయా రెవెన్యూ డివిజన్ పరిధిలోని సంబందిత అధికారులు, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గౌతమి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీచూడండి:

టిక్కెట్ ఉంటేనే దర్శనానికి అనుమతి: కలెక్టర్ ఇంతియాజ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.