కరోనా వ్యాప్తి నివారణకు జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రజలు స్వచ్ఛందంగా.. కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ప్రజలు ఉదయం 7 గంటల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. రద్దీగా ఉండే శివాలయం కూడలి, గాంధీ రోడ్డు, మైదుకూరు రోడ్డు వెలవెలబోతున్నాయి. పట్టణంలో బంగారం, వస్త్ర, వ్యాపార దుకాణాలను మూసివేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలు అన్నీ నిలిపివేశారు.
ఇదీ చదవండి: లైవ్ అప్ డేట్స్: జనతా కర్ఫ్యూ @ ఆంధ్రప్రదేశ్