కడప జిల్లాలో బుధవారం 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పులివెందుల సబ్ డివిజన్ అయిన వేంపల్లిలో 2 పాజిటివ్ కేసులు నమోదైనందున కోర్ ఏరియాగా ప్రకటించామని పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ తెలిపారు. దీని పరిధి 3 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. పట్టణంలోని రహదారులు, షాపులను మూసివేశారు. వేంపల్లి మండలాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
బద్వేల్..
కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో కడప జిల్లాలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. బద్వేల్ పట్టణంలో కరోనా వైరస్ నియంత్రణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పట్టణంలో ప్రత్యేక వాహనం ద్వారా పిచికారీ చేశారు. బద్వేల్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి: