ETV Bharat / state

జిల్లాలో సేవా కార్యక్రమాలు.. పేదలకు అందుతున్న సరుకులు - kadapa district latest news

ఎర్రగుంట్లలో రైల్వే కాంట్రాక్టర్​ తుంగ వెంకట్రామిరెడ్డి, ట్రైనీ డీఎస్పీ శ్రీపాదరావు... పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాజంపేటలో కూరగాయల వ్యాపారులకు మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశారు.

helping poor in kadapa district
కడప జిల్లాలో సేవా కార్యక్రమాలు
author img

By

Published : Apr 2, 2020, 4:40 PM IST

కరోనా వైరస్ కేసులు కడప జిల్లాలో​ పెరుగుతున్న నేపథ్యంలో ఎర్రగుంట్ల నగరపంచాయతీ మహేష్​ నగర్​లోని రైల్వే కాంట్రాక్టర్​ తుంగ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేపట్టారు. కూలీ పనులు చేసుకుంటున్న వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వైరస్​ రాకుండా ఇరవై సెకండ్లు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ప్రజలకు తుంగా వెంకట్రామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ శ్రీపాదరావు తెలిపారు.

రాజంపేటలో..

కరోనా కట్టడికి ఎంతోమంది యువకులు తమ వంతు సహకారం అందిస్తున్నారు? కడప జిల్లా రాజంపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ వ్యాపారులకు శివ డాన్స్ అకాడమీ నిర్వాహకుడు శివ డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పురపాలక కమిషనర్ రాజశేఖర్ ద్వారా మాస్కులు, గ్లౌజు​లు, సబ్బులు అందజేశారు. మార్కెట్లో వ్యాపారులు తప్పకుండా గ్లౌజ్ లు వేసుకోవాలని డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి మాట్లాడుతూ సూచించారు. క్రయవిక్రయాల సమయంలో కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదముందని తెలిపారు. ప్రజలు కూడా ప్రతిరోజు మార్కెట్ కి రాకుండా వారానికి సరిపడా కూరగాయలు, నిత్యవసర వస్తువులను ఒకే సారి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.

ఇదీ చదవండి:

కొత్తపేటలో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.