కడపలో బుధవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం తడిసి ముద్దయింది. నగరంలోని ప్రధాన రహదారులపై మోకాలు లోతు వరకు వర్షపునీరు నిలిచిపోయాయి. కడప మెయిన్ రోడ్డులోని ఏ వీధి చూసినా చెరువులను తలపించాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నివాసాల్లోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు.ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, అంబేద్కర్ కూడలి, అప్సర రోడ్డు, ఎన్జీవో కాలనీ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇది చదవండి : TS - AP WATER WAR: మా నీటికి ఎసరు.. తెలంగాణను అడ్డుకోండి