CORONA: ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డికి కరోనా సోకింది. రెండు రోజులుగా దగ్గు జలుబుతో బాధపడుతున్న ఆయన ఆదివారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
ప్రస్తుతం ఆరోగ్యంగా హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యం తీసుకుంటున్నట్లు.. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. ప్రజల అత్యవసర సమస్యలపై ఫోన్ ద్వారా తనతో మాట్లాడవచ్చని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి కరోనా నుంచి రక్షణ పొందాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'అతడో ఆర్మీ జవాన్.. పోర్న్ చూసే అలవాటు ఉంది.. కామ వాంఛ తీర్చుకునేందుకు..'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!