కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన గండికోట అలనాటి పౌరుషానికి ప్రతీకగా నిలుస్తోంది. కోటను సందర్శించేవారికి అనేక కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. గండికోటను స్వాధీనం చేసుకునేందుకు శత్రురాజులు దండెత్తేవారు. వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు అప్పట్లో ఫిరంగులను ఎక్కువగా వాడే వారని కైఫీయతుల ద్వారా తెలుస్తోంది. గోల్కొండ నవాబు ప్రధాని మీర్ జుమ్లా గండికోటను స్వాధీనం చేసుకునేందుకు మూడు నెలలపాటు ప్రయత్నించినా కోటలోనికి ప్రవేశించలేకపోయారని.. అందుకు ఫిరంగి గుండ్ల దాడులే కారణమని గండికోట కైఫీయతుల ద్వారా తెలుస్తోంది.
ఫిరంగులతో మైళ్ల దూరం వరకు దాడులు
గండికోట వైభవంగా ఉన్నప్పుడు 31 ఫిరంగులు ఉన్నట్లు చెబుతారు. ప్రస్తుతం రెండు ఫిరంగుల శకలాలు మాత్రమే మనం చూడొచ్చు. జుమ్మా మసీదు ఎదురుగా ఉన్న రామబాణం బురుజు పైన ఫిరంగిని ఏర్పాటు చేసి పేల్చితే కొన్ని మైళ్ల దూరంలో గుండు పడేదని చరిత్రకారులు చెబుతారు. కోట ముఖ ద్వారం వద్ద రెండు ఫిరంగుల శకలాలు మాత్రమే ప్రస్తుతం మనం చూడొచ్చు.
ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన గండికోటలో అభివృద్ధి కార్యక్రమాల కోసం తవ్వకాలు జరిపినప్పుడు ఎనిమిది ఫిరంగి గుండ్లను గుర్తించారు. ఒక్కొక్క గుండు 10 కిలోల బరువు తూగుతోంది.
ఇదీ చదవండి: