కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో ఇరవై నాలుగు రోజులుగా నిర్వాసితులు దీక్ష కొనసాగిస్తున్నారు. గండికోట జలాశయంలో 23 టీఎంసీల వరకు నీటి నిల్వ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
తమకు అందాల్సిన పరిహారంతో పాటు గడువు పెంచి పునరావాస కాలనీల్లో సదుపాయాలు పూర్తి చేయాలని నిర్వాసితుల కోరుతున్నారు. ముందు ఖాళీ చేయాలని అధికారులకు ఆదేశించడంతో బాధితుల సమస్య జఠిలమవుతోంది. ఇప్పటికే బీసీ కాలనీలో చాలా ఇళ్లు నీట మునిగిపోగా... ఎస్సీ కాలనీని వెనక జలాలు ముంచెత్తుతున్నాయి. మనుషులు, మూగజీవాలు ఆ జలాల్లోనే నివాసం ఉంటున్నాయి. మరుగుదొడ్లు నీటితో నిండిపోయాయి. కాలకృత్యాలు తీర్చుకుందామంటే ఇంటా బయట నీళ్లే ఉన్నాయి...అందుకే తినడం, తాగడం తగ్గించుకున్నామని బాధితులు వాపోతున్నారు. జలాశయంలో నీటిని తగ్గించి ఇళ్ల నిర్మాణానికి గడువు ఇవ్వాలని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఇదీ చదవండి: బతుకుతెరువుకోసం వలస వచ్చారు.. ప్రత్యేకత చాటుకుంటున్నారు!