Greenery: పచ్చదనం ఆ కాలనీల సొంతం. అక్కడ ప్రతి ఇంటి ముంగిటా చెట్లు కనిపిస్తాయి. వైఎస్‌ఆర్ జిల్లా ముద్దనూరులోని ఎల్‌ఎం కాంపౌండ్, ఎస్.వి.గిరి కాలనీలు వేపచెట్ల వనాన్ని తలపిస్తున్నాయి. 20 ఏళ్ల కిందట నాటిన మొక్కలు పెరిగి ఇప్పుడు ఆ కాలనీల వాసులకు నీడ, మంచి గాలి అందిస్తున్నాయి. రెండు కాలనీల్లో సుమారు 500 ఇళ్లు ఉండగా వేపచెట్లే 800 వరకూ ఉన్నాయి. కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టినా చెట్లను తొలగించకుండా గోడలు నిర్మిస్తున్నారు. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతూ స్థానికులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి: