కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో సోమవారం విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్‌పై జరిగిన దాడికి సంబంధించి మంగళవారం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో సాక్ష్యాల ఆధారంగా మరికొందరి అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ కొండారెడ్డి తెలిపారు. నూతన పీఠాధిపతి ఎన్నిక విషయంలో జరిగిన పరిమాణాలను నివృత్తి చేసేందుకు విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా.. దాడికి దిగారు. ఈ ఘటనపై కార్పొరేషన్ ఛైర్మన్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేసులో నిందితులుగా ఉన్న శ్రీయపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, లెక్కల రమణారెడ్డి, గోవిందపల్లె శ్రీరాములు, భూమిరెడ్డి సుబ్బనారాయణరెడ్డి, గూడూరు మధుసూదనలను అరెస్ట్ చేసినట్లు సీఐ వివరించారు. ముందస్తు అనుమతులు లేకుండా సమావేశాలు, ధర్నాలు చేయరాదని, విలేకరుల సమావేశం నిర్వహించాల్సి వస్తే ముందస్తు అనుమతి తీసుకోవాలని సీఐ సూచించారు. ప్రజాశాంతికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి