కరోనా కేసుల నమోదుతో కడప జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేట గ్రామంలో తొలి కరోనా మరణం నమోదైనట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. గత నెల 30న ఓ యువకుడికి కరోనా సోకింది. దీంతో, అధికారులు గ్రామంలో అంబులెన్స్ ను ఏర్పాటు చేసి ఈ నెల 3వ తేదీన స్థానికులకు మరిన్ని పరీక్షలు నిర్వహించారు.
3వ తేదీన మొత్తం 178 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 64 ఏళ్ల వృద్ధుడు ఉన్నారు. పరీక్షలు చేయించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా... ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా, మార్గం మధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 3వ తేదీన అతని రిపోర్టు రాగా..అతనికి సైతం కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు.
ఆ నివేదికతో వైద్యాధికారులు జిల్లాలోనే తొలి కరోనా మరణం కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా...ఈ నెల 5వ తేదీన జిల్లా సంయుక్త కలెక్టర్ సాయికాంత్ వర్మ నవాబుపేట గ్రామాన్ని సందర్శించి, కరోనా నివారణ జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి