కడప జిల్లా రాయచోటి పట్టణం సంజీవ్ నగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ బేకరీ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేకరీలో నూనె, గ్యాస్ సిలిండర్లు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో దుకాణంలో పని చేసే సిబ్బంది పరుగులు తీశారు. పొగ విపరీతంగా రావటంతో స్థానికులు భయాందోళనలకు గురై..అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల విలువైన సామాగ్రితో పాటు, మిఠాయిలు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయని యజమాని వాపోయారు.
ఇదీచదవండి