కడప బిల్టప్ సమీపంలో ఒక ప్లాస్టిక్ గోదాంలో.. రాత్రి 10 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదంలో సంభవించింది. సుమారు రూ. 40 లక్షలు ఆస్తినష్టం వాటిల్లింది. ప్రమాద సమయంలో 30 లక్షల రూపాయల విలువచేసే సరుకు నిల్వ ఉందని వాటితోపాటు పది లక్షల రూపాయల విలువచేసే యంత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదసమయంలో గోదాంలో నిల్వ ఉంచిన పాత ప్లాస్టిక్ సామాగ్రి కాలి బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. లేదా ఎవరైనా నిప్పు పెట్టారా, మరే ఇతరకారణాల వల్ల ప్రమాదం జరిగిందా అని తెలియాల్సి ఉంది.
భారీగా ఎగసిపడిన అగ్ని కీలలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది దాదాపు 5 నుంచి 10 అగ్నిమాపక వాహనాలతో తీవ్రంగా శ్రమించినప్పటికీ.. చాలా సేపు మంటలు అదుపులోకి రాలేదు. భారీ ఎత్తున మంటలు చెలరేగి చుట్టుపక్కలకు వ్యాపించడంతో... పోలీసులు అక్కడి చుట్టుపక్కల నివాసముంటున్న వారిని ఖాళీ చేయించారు. భయబ్రాంతులకు గురైన స్థానికులు అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ మంటల ధాటికి పక్కనే ఉన్న చిన్న చిన్న బంకులు కూడా కాలిపోయాయి.
ఇదీ చదవండి: