శనగకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం శనగ రైతులను ఆదుకోవాలంటూ ర్యాలీ నిర్వహించారు. కడప, కర్నూలు జిల్లాలకు చెందిన రైతులు భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శనగకు కనీస మద్ధతు ధర రూ.5,500 ప్రకటించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా సరైన గిట్టుబాటు ధర లేక దిగుబడి అంతా గోదాముల్లో మగ్గుతోందని వాపోయారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి రైతులకు మద్ధతు తెలిపారు. ఆర్డీఓ నాగన్నకు వినతిపత్రం అందించి.. తమ సమస్య పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: