కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొందరు కేటుగాళ్ళు ఫసల్ బీమా పథకాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశారు. నిడుజువ్వీ గ్రామంలోని కొందరు రైతులకు తెలియకుండానే వారి భూములకు 2019 ఖరీప్ పంటకు సంబంధించి రూపాయి చొప్పున బీమా కట్టారు. అయితే వచ్చిన దరఖాస్తులపై అధికారులు విచారణ చేపట్టారు. మొత్తం 12,771 మంది నమోదు చేసుకోగా... వీటిలో 5825 వాటిల్లో తప్పులు దొర్లాయని మండల వ్యవసాయ అధికారి వెల్లడించారు.
వీటిపై క్షేత్ర స్థాయిలో విచారణ చేయగా... 2250 మంది తప్పుడు రికార్డు సమర్పించి బీమా కట్టినట్లు తేలిందని పేర్కొన్నారు. వీటిల్లో పట్టాలు లేని భూములతో పాటు వాగులు, గుట్టలను కూడా ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని తిరస్కరించామని వివరించారు. సరైన సమాచారమంతా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.
ఇదీ చదవండి: