ETV Bharat / state

'ప్రాణాలు పోతున్నా యూసీఐఎల్​పై చర్యలేవీ...?'

యురేనియం కాలుష్యం కారణంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కడప జిల్లా తుమ్మలపల్లి యూసీఐఎల్ అధికారులపై చట్టపర చర్యలు తీసుకోవాలని పర్వావరణ శాస్త్రవేత్త కె. బాబూరావు అన్నారు. ఈ కర్మాగారం వల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో భూగర్భ జలాలు కనీసం వ్యవసాయానికి కూడా ఉపయోగపడనంత కలుషితం అయ్యాయన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సదరు కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవడం ప్రశ్నించారు.

ప్రజల ప్రాణాలపై చెలగాటమాడుతున్న యూసీఐఎల్​పై చర్యలేవీ..? : శాస్త్రవేత్త బాబూరావు
author img

By

Published : Oct 18, 2019, 8:24 PM IST

Updated : Oct 18, 2019, 11:45 PM IST

ప్రజల ప్రాణాలపై చెలగాటమాడుతున్న యూసీఐఎల్​పై చర్యలేవీ..? : శాస్త్రవేత్త బాబూరావు
కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం కాలుష్యం కారణంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యూసీఐఎల్ అధికారులపై చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని విశ్రాంత పర్యావరణ శాస్త్రవేత్త కె.బాబూరావు అన్నారు. యురేనియం బాధిత గ్రామాల్లో బాబూరావు బృందం పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంది. జిల్లాలోని కేకే కొట్టాల, కనంపల్లి, మబ్బుచింతలపల్లి, భూమయ్యగారిపల్లె గ్రామాల్లో బృందం పర్యటించింది. యురేనియం కర్మాగారం అనర్థాల వల్ల భూగర్భ జలాలు... తాగడానికి, వ్యవసాయానికి పనికి రానంతగా కలుషితం అయ్యాయని కృషి విజ్ఞాన కేంద్రం నివేదికలు వెల్లడిస్తున్నా.... ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాబూరావు ప్రశ్నించారు. యూసీఐఎల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే టెయిల్ పాండు నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఆయన ఆక్షేపించారు. కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన కాలుష్య నియంత్రణ మండలి ఎందుకు కంపెనీపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధిత గ్రామాల్లో తక్షణం వైద్య సదుపాయాలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్న ఆయన... వీటిపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సూచనలతో మరోమారు నివేదిక అందిస్తామన్న బాబూరావుతో ఈవీటీ భారత్ ముఖాముఖి.

ఇదీ చదవండి :

'యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు'

sample description
Last Updated : Oct 18, 2019, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.