కడప జిల్లా రాజంపేటలో ఎన్నికల కోడ్ను అధికారులు సక్రమంగా అమలు చేయడం లేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నియమావళి ప్రకారం అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల బ్యానర్లు, గోడ పత్రికలను తొలగించాల్సి ఉంది. విగ్రహాలకు పూర్తిగా ముసుగులు వేయాల్సి ఉంది. కానీ రాజకీయ నాయకుల విగ్రహాల తలకు మాత్రమే ముసుగు వేశారు. పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగులు అలాగే ఉన్నాయి కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్న చిత్రానికి పేపర్ అంటించారు. పట్టణంలో పలు సచివాలయాలకు రంగులు తొలగించలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు ముందు ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటోలను తొలగించలేదు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రచార బోర్డులను సైతం అలాగే వదిలివేశారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రికి ఎన్నికల కోడ్ వర్తించదా..?: చంద్రబాబు