ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కొత్తగా నిర్మించిన భవనాల రంగులు నచ్చాయి. ఆ రంగులనే ప్రాంగణంలోని తరగతి గదులకు, వసతి భవనాలకు కూడా వేయాలని సూచించారు. దీంతో మూడు కోట్ల రూపాయల వ్యయంతో ట్రిపుల్ ఐటీలోని తరగతి భవనాలకు కొత్త రంగులు వేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల కు చెందిన 6 వేల మంది గ్రామీణ పేద విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. జులై 7, 8 తేదీల్లో ముఖ్యమంత్రి ఇడుపులపాయకు వస్తుండటంతో ఇక్కడ 138 కోట్ల రూపాయలతో నిర్మించిన వివిధ రకాల ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గదులు, రూ. 40 కోట్లతో నిర్మించ తలపెట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆడిటోరియానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. వైఎస్ జగన్హన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రెండు సార్లు ఇడుపులపాయకు వచ్చారు. హెలికాప్టర్లో వచే క్రమంలో పై నుంచి చూసినప్పుడు 138 కోట్ల తో నిర్మించిన ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ గదుల రంగులు ముఖ్యమంత్రి ఆకట్టుకున్నాయని అధికారులు తెలిపారు. దీంతో అవే రంగులు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని అన్ని గదులకు వేయాలని వర్సిటీ కులపతి ఛాన్సలర్ కెసి.రెడ్ది కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి కొత్త సొబగులు - iiit building colours latest news
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి నిర్మించిన కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ భవనాలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల కు చెందిన 6 వేల మంది గ్రామీణ పేద విద్యార్థులు ఇక్కడ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు.