కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరుగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతులేకుండా.. బరిలో నిలబడ్డారు. ఎంకామ్ వరకు చదువుకున్న ఆమె.. తన ఊరి సమస్యలను పరిష్కరించాలనే ధ్యేయంతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
రాజకీయాల్లో చదువుకున్న నేతలు కరువవుతుండటం వల్లే చాలామందికి అన్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. యువత కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఏ పార్టీ మద్దతులేకున్న స్వతంత్రంగా పోటీలో నిలిచానని వెల్లడించారు. తమ గ్రామంలో రోడ్లు, మురుగు వ్యవస్థ అధ్వానంగా ఉందని.. గెలిచిన వెంటనే అభివృద్ధికి శ్రీకారం చుడతానని వరలక్ష్మి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: