రైతుల శ్రేయస్సు కోసం మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. క్షేతస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కడపలో ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
కడప జేడీఏ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేడీఏ మురళీ కృష్ణ, రైతులు పాల్గొన్నారు. కడప మండలంలో కేవలం 1500 హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు సాగు చేస్తున్నారని గుర్తించారు. రైతుల కోరిక మేరకు అలంఖాన్ పల్లె, దేవుని కడప ప్రాంతాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఇచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించి... వాటిని జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో చర్చిస్తామన్నారు.
ఇదీ చదవండి : నాడు విద్యార్థులకు పాఠం.. నేడు వేతనాల్లేక దుర్భర జీవనం..!