కడప జిల్లా జమ్మలమడుగులో రాత్రంతా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీటమునిగాయి. ఎగువ నుంచి గండికోట జలాశయానికి 9 వేల 600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఆనకట్టలో ప్రస్థుత నీటి నిలువ 12.62 టీఎంసీలుగా ఉంది.
గండికోట నుంచి మైలవరానికి 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మైలవరానికి 3 వేల 500 క్యూసెక్కుల వర్షపునీరు చేరుతోంది. జలాశయం మొత్తం ఇన్ ఫ్లో 18 వేల 500 క్యూసెక్కులుగా ఉంది. మైలవరం ప్రాజెక్టు నుంచి పెన్నానదికి 5 గేట్ల ద్వారా 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి: