కడప జిల్లాలో నవంబర్ 2 నుంచి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేస్ - 3 కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. బుధవారం స్పందన హాల్లో జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
గోపవరం, కలసపాడు, ఒంటిమిట్ట, చిన్నమండెం, ఓబులవారిపల్లె, ఎర్రగుంట్ల, మైలవరం, ప్రొద్దుటూరు, కాజీపేట, కడపలోని 49, 50, వార్డులలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వచ్ఛందంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: