ETV Bharat / state

24న పులివెందులకు సీఎం.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ - kadapa district collector news

కడప జిల్లా పులివెందులలో ఈనెల 24న ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

District Collector inspected the visit arrangements of the CM
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్
author img

By

Published : Dec 22, 2020, 8:35 AM IST

పులివెందులలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసీ డిపో, అపాచి లెదర్ ఇండస్ట్రీలకు ఈనెల 24న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆర్టీసీ డిపో ప్రాంతంలో బహిరంగ సభ, వేదిక నిర్మాణం, వీఐపీ, వీవీఐపీ సీటింగ్, వివిధ అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాల ఆవిష్కరణలపై చర్చించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

ఏపీ కార్ల్, అపాచీ లెదర్ పరిశ్రమ ప్రాంతాలను సందర్శించి.. అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీఎం పర్యటించే అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

28న శ్రీకాళహస్తికి సీఎం.. పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్​ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.