కడప జిల్లాలో 33 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొవిడ్ విధులకు దూరంగా ఉన్నందుకు కారణాలు తెలపాలంటూ.. జిల్లా విద్యాధికారిణి శైలజ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కరోనా భయంతో వారు విధులకు గైర్హాజరయ్యారు. వారందరికీ జిల్లా శైలజ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో నోటీసులకు సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: