కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు చర్యలుచేపట్టారు. వరుస దాడులతో బెట్టింగ్ నిర్వాహకుల పనిపడుతున్నారు. శుక్రవారం పట్టణంలోని దస్తగిరిపేటకు చెందిన క్రికెట్ బుకీ ఖురేషి షాహిద్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు టూ టౌన్ ఎస్సై.. బెట్టింగ్ బుకీని చాకచక్యంగా పట్టుకున్నట్లు డీఎస్పీ సుధాకర్ తెలిపారు. ఇది వరకు పాత బెట్టింగ్ కేసుల్లో నిందితుడుగా షాహిద్ ఉన్నాడని వివరించారు.
ఇదీ చదవండి :