కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఇవాళ మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా పెరిగిన కేసులతో కలిపి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 23 కు చేరాయి. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్ డౌన్ నిబంధనలు మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. రెడ్ జోన్, బఫర్ జోన్ పరిధిలోకి ఎవరినీ బయటికి రానీయకుండా చర్యలు చేపట్టారు. జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.