కడప కలెక్టరేట్లో కరోనా కలకలం సృష్టించింది. డీ-బ్లాక్‌లోని డ్వామా కార్యాలయంలో 60 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..18 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. బాధితులను హోం ఐసోలేషన్‌కు పంపించామని జిల్లా అధికారులు తెలిపారు. మిగిలిన 42 మందిని ఇంటి నుంచే పని చేయాలని సూచించినట్లు వెల్లడించారు.
ఇదీచదవండి