కరోనా వైరస్ ప్రభావం కడప జిల్లాలో రవాణా శాఖపై పడింది. నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించమించడంలో అధికారులు చతికిలపడ్డారు. కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ విధించిన కారణంగా.. వాహనదారుల రాకపోకలు తగ్గాయి. కార్యాలయంలో కార్యకలాపాలు దాదాపుగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితి ఆదాయంపై స్పష్టంగా కనిపించింది.
2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.57 కోట్ల ఆదాయం లక్ష్యాన్ని కేటాయించగా… ఇప్పటివరకు రూ.18 కోట్లు మాత్రమే సాధించారు. లాక్డౌన్ వల్ల కొత్త వాహనాల కొనుగోలు లేదు. ఫిట్నెస్, జీవితపు పన్ను, సర్వీస్ ఛార్జీలు రావడం లేదు. ఇలా అయితే ఈ ఏడాది లక్ష్య సాధన కష్టమే అని అధికారులు భావిస్తున్నారు.