కడప జిల్లా రాజంపేటలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. పట్టణంలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న ఓ మహిళకు, కువైట్ నుంచి వచ్చి క్వారంటైన్లో ఉంటున్న భార్యాభర్తలకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి ప్రకటించారు. ఆ ముగ్గురినీ కడపలోని ఫాతిమా కళాశాలలోని క్వారంటైన్‌కు తరలించారు.
ఈడిగపాలెం ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, డీఎస్పీ, తహసీల్దార్ రవిశంకర్ రెడ్డిలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. రెడ్‌జోన్ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. సచివాలయ ఆరోగ్య కార్యకర్త విధులు నిర్వహించిన ప్రాంతంలోని వ్యక్తులకు, తోటి సిబ్బందికి కరోనా పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఇవీ చదవండి.. పెద్ద ఎత్తున ఇసుక సీజ్ చేసిన ఎస్ఈబీ