ETV Bharat / state

భైరవకోనకు వెళ్లి... నీటిలోనే చిక్కుకుని.. చివరికి..! - భైరవకోనలో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులు

తలనీలాలు సమర్పించేందుకు వెళ్లిన వారంతా నీటిలోనే చిక్కుకుపోయారు. కడప జిల్లా మైదుకూరులోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలసిన భైరవకోనకు వెళ్లిన సుమారు 30మంది... భారీ వర్షాలకు అక్కడే చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

cops saved people went to bairavakona of kadapa district and strucked there due to heavy rains
భైరవకోనలో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులు
author img

By

Published : Sep 15, 2020, 7:31 AM IST

తలనీలాలు సమర్పించేందుకు కడప జిల్లా మైదుకూరులోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలసిన భైరవకోనకు వెళ్లిన సుమారు 30మందిని పోలీసులు రక్షించారు. భారీ వర్షం కారణంగా వారంతా అటవీ ప్రాంతంలో చిక్కుకున్నారు. జిల్లాలోని ఖాజీపేట మండలం అగ్రహారానికి చెందిన లక్ష్మీ, ప్రశాంత్ దంపతులు పిల్లల తలనీలాలు సమర్పించేందుకు రెండు ట్రాక్టర్లలో వారి బంధువులు దాదాపు 30 మందితో కలిసి భైరవకోనకు వెళ్లి... తిరుగు ప్రయాణమయ్యారు.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భైరవకోన వద్ద ఉన్న వాగు పొంగి భారీగా ప్రవహించిన కారణంగా ముందుకు వెళ్లలేకపోయారు. 24 గంటల్లో ఇంటికి చేరాల్సిన వారు తిరిగి రాకపోయేసరికి ఆందోళనకు గురైన వారి కుటుంబసభ్యులు... పోలీసులకు సమాచారం అందించారు. మైదుకూరు అర్బన్ సీఐ మధుసూదన్ తన సిబ్బందితో పాటు ముదిరెడ్డిపల్లె తండా వాసుల సహాయంతో వాగు వద్ద వారిని కలుసుకున్నారు. తాళ్ల సహాయంతో వాగు దాటించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

ఇదీ చదవండి:

పాపికొండల్లో బోటు ప్రమాదం జరిగి ఏడాది.. నాడు 51 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.