కడప జిల్లా రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో పడకలను వందకు పెంచుతున్నారు. దానికి తగ్గట్టు 22 కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. నిర్మాణంలో ఉన్న కొత్త భవనాలను పరిశీలించి..సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అన్నీ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.
ఇదీ చదవండి: ఎస్సీ మహిళ హత్యాచార కేసులో అసలు నిందితులెవరు? వర్ల రామయ్య