ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదే: తులసిరెడ్డి - పోలవరం ప్రాజెక్టుపై తులసిరెడ్డి వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదే అని.. కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. అదే సమయంలో నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

tulasireddy
తులసిరెడ్డి, కాంగ్రెస్ నేత
author img

By

Published : Oct 24, 2020, 3:30 PM IST

పోలవరం ప్రాజెక్ట్ కాంగ్రెస్ మానస పుత్రిక అని.. ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. 1980లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేయగా.. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనా అనుమతులిచ్చారని గుర్తుచేశారు.

పోలవరం రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన వరమని.. బహుళార్ధసాధక ప్రాజెక్ట్, గ్రావిటీ ప్రాజెక్టుగా అభివర్ణించారు. విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదే అని తులసిరెడ్డి స్పష్టంచేశారు. నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేస్తూ.. రాష్ట్రంపై భారం పడకుండా పోలవరాన్ని పూర్తిచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

'అర్ధరాత్రి జీవోలు, అక్రమ అరెస్టులు సీఎంకు అలవాటే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.