ETV Bharat / state

సీఎం జగన్ బర్త్​డే వేడుకలు - అధికారుల అత్యుత్సాహంపై విమర్శల వెల్లువ

CM Jagan Birthday Celebrations in AP: రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

CM_Jagan_Birthday_Celebrations_in_AP
CM_Jagan_Birthday_Celebrations_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 1:12 PM IST

Updated : Dec 21, 2023, 2:49 PM IST

CM Jagan Birthday Celebrations in AP: సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల నిర్వహణపై పలుచోట్ల అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు విద్యార్థులతో నినాదాలు చేయిస్తూ ర్యాలీలు నిర్వహించాలని సూచిస్తున్నారు. దీంతో అధికారుల తీరు విద్యాసంస్థలను రాజకీయ వేదికలుగా మార్చేలా ఉందంటూ పలువురు విమర్శిస్తున్నారు.

సీఎం జగన్ పుట్టినరోజు..9 ప్యాకేజీలు ప్రకటించిన ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌

విద్యాశాఖ అధికారి తీరుపై విమర్శలు:
వైఎస్సార్ జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించాలని ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు వాట్సప్‌ సందేశం ద్వారా డీఈవో ఆదేశించారు.

AP CM Jagan Birthday Celebrations in Schools: దీంతో ప్రొద్దుటూరులో "హ్యాపీ బర్త్‌డే జగన్‌ మామయ్య", "మాకు జగన్‌ మామయ్యే కావాలి" అనే నినాదాలు, బ్యానర్లతో విద్యార్థులతో ర్యాలీలు చేయించాలని అధికారులు సూచించారు. విద్యాశాఖ అధికారుల సందేశాలతో ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. అధికారుల ఆదేశాలు పాఠశాలలను రాజకీయ వేదికలుగా మార్చెలా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు.

ఫ్లెక్సీ ఏర్పాటుతో ఉపకులపతి మరోసారి అభాసుపాలు:
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి(Vice Chancellor) రాజశేఖర్ ముఖ్యమంత్రి జగన్​పై మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా విశ్వవిద్యాలయం బయట భారీ ఫ్లెక్సీ(CM Jagan Birthday Flexis) ఏర్పాటు చేశారు. రాజశేఖర్ ఉపకులపతి అయిన తర్వాత విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్సీపీ అనుబంధ కార్యాలయంగా మార్చారని ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.

CM YS Jagan Birthday Celebrations in Universities: విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహం(YSR Statue) ఏర్పాటు, మూడు రాజధానులకు అనుకూలంగా సదస్సు, వైఎస్సార్సీపీ ప్లీనరీకి వాహనాల పార్కింగ్ ఇవ్వడం, తదితర కార్యక్రమాలు చేసి విమర్శల పాలైన వీసీ తాజాగా ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీతో మరోసారి అభాసుపాలవుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు.

ఘనంగా సీఎం జగన్ జన్మదిన వారోత్సవాలు.. భారీగా తరలివచ్చిన జనం

వైఎస్సార్సీపీలో బయటపడిన వర్గపోరు:
మరోవైపు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీలో వర్గపోరు(Class War in YSRCP) బయటపడింది. రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ నేతలు సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు విడివిడిగా నిర్వహించారు.

CM Jagan Birthday Celebrations in Bapatla District: అద్దంకి ఆర్‌అండ్‌బీ బంగ్లాలో హనిమిరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం(Blood Donation Camp) ఏర్పాటు చేయగా వైఎస్సార్సీపీ కార్యాలయంలో బాచిన కృష్ణచైతన్య ఆధ్వర్యంలో మరో వర్గం వేడుకలు నిర్వహించారు. హనిమిరెడ్డిని ఇంఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి కృష్ణచైతన్య ఆయనకు దూరంగా ఉంటున్నారు. రెండు రోజుల క్రితం హనిమిరెడ్డి పరిచయ కార్యక్రమానికి కూడా కృష్ణచైతన్య హాజరుకాలేదు.

సీఎం బాపట్ల పర్యటన.. నిధులు లేక మండలాల నుంచి సమీకరణ

కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీలో వర్గపోరు:
మరోవైపు కర్నూలు జిల్లా ఆస్పరి వైఎస్సార్సీపీలో కూడా వర్గవిభేదాలు బయటపడ్డాయి. మంత్రి గుమ్మనూరు, జెడ్పీటీసీ విరూపాక్షి ఇరువర్గాలు సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పోటాపోటీగా బ్యానర్లు ఏర్పాటు చేశాయి. ఆస్పరిలో కేక్ కట్ చేసేందుకు మంత్రి గుమ్మనూరు వర్గీయులు వచ్చి జెడ్పీటీసీ విరూపాక్షి వర్గం ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించారు.

Last Updated : Dec 21, 2023, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.