ETV Bharat / state

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ - కడపలో పార్టీ మీటింగ్స్​

జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు విధానాలనే అవలంబిస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆరోపించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే... నవంబర్ 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.

CITU state general secretary Venkateswara Rao
సీఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు
author img

By

Published : Oct 29, 2020, 4:12 PM IST

సీఎం జగన్​ కూడా చంద్రబాబు విధానాలనే అవలంబిస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆయన కడపలోని తమ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధిక పని భారంతో మున్సిపల్ కార్మికుల అవస్థలు పడుతున్నారని అన్నారు. గ్రామ సచివాలయం పరిధిలోకి మున్సిపల్ కార్మికులను తీసుకొని రావడం అనేది సరైంది కాదన్నారు.

అలా తీసుకురావాలంటే... ముందుగా మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే నవంబర్ 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని ఆర్ డి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

నవంబర్‌ 2 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం... షెడ్యూల్​ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.