ETV Bharat / state

'సమ్మెతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయాలి'

26న జరిగే దేశవ్యాప్త సమ్మె ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ కోరారు. రాష్ట్రంలో పోలీసుల అధికారం ఎక్కువైందని విమర్శించిన ఆయన డీజీపీ తీరు సరిగా లేదని ఆరోపించారు.

citu State Chief Secretary Gafoor press meet
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్
author img

By

Published : Nov 8, 2020, 12:49 PM IST

ఈనెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పిలుపునిచ్చారు. పరిమితికి మించి ఎక్కువ అధికారాన్ని ఉపయోగిస్తే ఆ ముఖ్యమంత్రికి కాలం చెల్లినట్లేనని కడప సీపీఎం కార్యాలయంలో వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు ఎదురైన పరిస్థితి జగన్మోహన్​రెడ్డికి రాకుండా చూసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని ఆరోపించిన ఆయన లక్షల నివాసాలు నిర్మించినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభించక పోవడం దారుణమని ఖండించారు.

ఇవీ చూడండి...

'పదవి నాకు మరింత బాధ్యతను పెంచింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.