ETV Bharat / state

కడపలో తగ్గుతున్న అమ్మాయిల జనాభా

ఆడపిల్లను ఇంటి మహలక్ష్మిగా భావించి ఎంతో గౌరవంగా చూసే పవిత్ర దేశం మనది. అలాంటి పుణ్యగడ్డ పై లోకాన్ని చూడకుండా... తల్లి గర్భంలోనే మరణిస్తున్న పసికందులు ఎందరో. వారు చేసిన పాపం కేవలం ఓ స్త్రీ గా రూపు దిద్దుకొవాలని అనుకొవటమే.

కడపలో తగ్గుతున్న అమ్మాయిల జనాభా
కడపలో తగ్గుతున్న అమ్మాయిల జనాభా
author img

By

Published : Nov 30, 2020, 3:57 PM IST

Updated : Nov 30, 2020, 4:52 PM IST

బాలికల సంరక్షణకు అనేక చట్టాలున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. జిల్లాలో ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలికల పట్ల లింగ వివక్ష కొనసాగుతోంది. నిషేధం ఉన్నా గర్భస్థ లింగ నిర్ధరణ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలికలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బేటీ బచావో-బేటీ పడావో పథకం అమలుకు జిల్లాను ఎంపిక చేశారు. దేశంలో బాలికల సంఖ్య తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో మొదటి విడత కింద ఈ పథకాన్ని అమలు చేయ సంకల్పించారు. మన రాష్ట్రం నుంచి కడప జిల్లాను ఎంపిక చేశారు. జిల్లాలో బాలికల సంఖ్య ప్రతి వేయి మంది బాలురకు 937 మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా అయినా బాలికల సంఖ్యను పెంచటానికి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

child sexratio in kadapa
కడపలో తగ్గుతున్న అమ్మాయిల సంఖ్య

శిశు లింగ నిష్పత్తి

జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు మధ్య వెయ్యి మంది బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య క్షీణిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 1961 నుంచి ఈ ధోరణి బాగా తీవ్రంగా ఉన్నట్లు వెల్లడవుతోంది. బాలికల సంఖ్య క్షీణత క్రమంగా 1991లో ప్రతి వెయ్యి మంది బాలురకు 945 మంది బాలికలున్నారు. 2001లో వేయి మంది బాలురకు 927, 2011లో 918కి తగ్గడం ఆందోళన కలిగించే విషయం. లింగ నిర్ధరణ పరీక్షల ద్వారా ఆడపిల్ల అనగానే అబార్షన్‌ (భ్రూణ హత్య) చేయించే జాఢ్యం నెలకొంది.

●*దేశ ప్రధాని నరేంద్రమోదీ 2015 జనవరి 22వ తేదీన బేటీ పడావో-బేేటీ బచావో అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడత కింద ఎంపికైన జిల్లాల్లో కడప కూడా ఉంది. జిల్లాలో బాలికల సంఖ్య ఏటా తగ్గుముఖం పట్టటానికి బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, సామాజిక కారణాలు కూడా కారణమవుతున్నాయి.

●*●2012-13 నుంచి 2020-21 వరకు 315 బాల్య వివాహాలను అధికారులు నిలుపుదల చేసినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.

●*●నిలుపుదల చేసిన బాలికల వివాహాలు 311. బాలుర వివాహాలు నాలుగు మాత్రమే ఉన్నాయి. ● జిల్లాలో 0-6 సంవత్సరాల బాలుర సంఖ్యతో పోలిస్తే సగటున బాలికల నిష్పత్తి ప్రతి వేయి మంది బాలురకు 937 మంది బాలికలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

●*●2015-16 సంవత్సరంలో బాలికల నిష్పత్తి గణనీయంగా పడిపోయింది. ఆ సంవత్సరంలో వేయి మంది బాలురకు 900 మంది మాత్రమే బాలికలు జన్మించినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

●*●2020-21 సంవత్సరంలో అక్టోబరు వరకు చూస్తే బాలికల నిష్పత్తి సగటున 914కి తగ్గిపోయింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో బాలికల నిష్పత్తి 901గా నమోదైంది. మే నెలలో 950 మంది, జూన్‌ 881, జులై 929, ఆగస్టు 891, సెప్టెంబరు936, అక్టోబరులో 912గా నమోదైంది.

●*జిల్లాలో బాలికల నిష్పత్తిని పెంపొందించడానికి వీలుగా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా న్యాయసేవల విభాగం, విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, పోలీసు తదితర శాఖల అధికారులతో జిల్లా టాస్క్‌ ఫోర్సు ఏర్పాటు చేశారు. ఈ విధంగానే డివిజన్‌, మండలం, గ్రామ స్థాయి వరకు అధికారులు బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.

స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టాం...

జిల్లాలో బాలికల నిష్పత్తి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. బాలురతో సమానంగా బాలికల నిష్పత్తిని పెంచడానికి అధికార యంత్రాంగం తరఫున అన్ని చర్యలు చేపడుతున్నాం. లింగ నిర్ధరణ పరీక్షలు చేయకుండా జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా పెడుతున్నాం. గడిచిన మూడు నెలల్లో ఎక్కువ లింగ నిర్ధరణ పరీక్షలు నిర్వహించిన కేంద్రాల నివేదికలను పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం కళాశాలల్లో దిశ కమిటీలు ఏర్పాటు చేసి బాలికల చదువుపై అవగాహన కల్పిస్తున్నాం. ఇదే సందర్భంలో బాల్య వివాహాలు జరగకుండా అమ్మాయిలను చైతన్యం చేయాలని చూస్తున్నాం. జిల్లాలో దిశ, సఖి కేంద్రాలను బలోపేతం చేస్తున్నాం. - సాయికాంత్‌ వర్మ, జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) కడప

ఇదీ చదవండీ...అమానుషం: విషం కలిపి తల్లి, చెల్లిని కడతేర్చిన కిరాతకుడు

Last Updated : Nov 30, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.