ఐపీఎస్ శిక్షణ అధికారి మహేశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ రద్దు చేసింది. అక్టోబర్ 27న తన భర్త వేధిస్తున్నాడని మహేశ్వర్‌రెడ్డి భార్య హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. దీంతో యూపీఎస్సీ, జాతీయ ఎస్సీ కమిషన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ శిక్షణ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. వాటి ఆధారంగా మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈనెల 12న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ మహేశ్వర్‌రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన క్యాట్ ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మహేశ్వర్ రెడ్డిని ఎన్పీఏలో శిక్షణకు అనుమతించాలని... నియామకం మాత్రం తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'హైకోర్టును కర్నూలుకు తరలిస్తే సహించేదిలేదు'