కడప జిల్లా బద్వేలులో నకిలీ భూమి పట్టా సృష్టించిన వ్యక్తిపై రెవెన్యూ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం గోసులకూరపల్లెకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి 2005లో అప్పటి ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసి నకిలీ డీకేటీ పట్టా సృష్టించారు. 1774 సర్వేనెంబర్లో 4.77 ఎకరాల భూమిని మిలటరీ కోటా కింద ఇచ్చినట్లు తయారుచేశాడు. నవరత్నాల పథకం అమలులో భాగంగా ఆ భూమిని రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లకు కేటాయించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు తనకు డీకేటీ పట్టా మిలటరీ కోటా కింద ఇచ్చారని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపిన రెవిన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు.
నకిలీ భూ పట్టా సృష్టించిన వ్యక్తిపై కేసు - Fake diketi patta news
బద్వేలులో నకిలీ భూమి పట్టా సృష్టించిన వ్యక్తిపై రెవెన్యూ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిలటరీ కోటా కింద 4.77 ఎకరాల భూమిని ఇచ్చారంటూ ఎమ్మార్వో ఫోర్జరీ సంతకం చేసి నకిలీ డీకేటీ పట్టా సృష్టించినందుకు శ్రీనివాసులు అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కడప జిల్లా బద్వేలులో నకిలీ భూమి పట్టా సృష్టించిన వ్యక్తిపై రెవెన్యూ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం గోసులకూరపల్లెకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి 2005లో అప్పటి ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసి నకిలీ డీకేటీ పట్టా సృష్టించారు. 1774 సర్వేనెంబర్లో 4.77 ఎకరాల భూమిని మిలటరీ కోటా కింద ఇచ్చినట్లు తయారుచేశాడు. నవరత్నాల పథకం అమలులో భాగంగా ఆ భూమిని రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లకు కేటాయించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు తనకు డీకేటీ పట్టా మిలటరీ కోటా కింద ఇచ్చారని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపిన రెవిన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ.. ఒకరు అరెస్ట్