ETV Bharat / state

ప్రొద్దుటూరులో రోడ్డెక్కిన బస్సులు

author img

By

Published : May 31, 2020, 10:16 AM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. 2 నెలల లాక్ డౌన్ తరువాత నేడే ఆర్టీసీ బస్సులు పునః ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా సీట్లు అమర్చారు.

kadapa district
ప్రొద్దుటూరులో రోడ్డెక్కిన బస్సులు

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. 2 నెలల తర్వాత బస్సు సర్వీసులను తిప్పేందుకు అధికారులు అనుమతించారు. ప్రొద్దుటూరు డిపో నుంచి ఇవాళ మొత్తం 25 సర్వీసులను జిల్లాలోని పలు ప్రాంతాలకు నడుపుతున్నారు. పల్లె బస్సులో 36 మంది, ఎక్స్​ప్రెస్ బస్సులో 30 మంది ప్రయాణికులను అనుమతించారు.

ప్రయాణ ప్రాంగణంలోనే కండక్టర్లు ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్నారు. బస్సులో కూర్చుని ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా సీట్లను ఏర్పాటు చేశారు. అలాగే చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకున్న తర్వాతే బస్సులోకి అనుమతిస్తున్నారు. ప్రయాణికులను రద్దీ ఆధారంగా బస్సు సర్వీసులను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ డీఎం మధు శేఖర్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

ఎస్​ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.